దేశంలో ఇప్పటి వరకు పాలించిన పాలకులు ఎవరూ తీసుకోని నిర్ణయాన్ని కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకుంది. 70 ఏళ్లకు పైగా 370 ఆర్టికల్‌పై వివాదం కొనసాగుతున్నా జమ్ము – కశ్మీర్ స్వయం ప్రతిపత్తి విషయంలో జోక్యం చేసుకోవడానికి కాంగ్రెస్ పాలకులు, కానీ గతంలో వాజ్‌పేయి ప్రభుత్వం కాని ముందుకు రాలేదు. కానీ మోదీ సర్కార్ అనూహ్యంగా ఆర్టికల్ 370 ని రద్దు చేసి కలకలం రేపింది. ఆర్టికల్ 370 రద్దు చేయడంతో కశ్మీర్ వ్యాలీలో హింసాకాండ చెలరేగుతుందని గ్రహించిన కేంద్రం గత వారం రోజులుగా భద్రతాదళాలను భారీగా మోహరించింది. యూనివర్సిటీల విద్యార్థులను, అమర్‌నాథ్ యాత్రికులను, టూరిస్టులను కశ్మీర్ నుంచి తిప్పి పంపేయించింది. ముందు జాగ్రత్తలు అన్నీ తీసుకుని, ఈ రోజు ఆర్టికల్ 370 రద్దు చేసి, జమ్ము కాశ్మీర్, లడఖ్ లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. వెంటనే రాష్ట్రపతి కార్యాలయం గెజిట్ కూడా విడుదల చేసింది. ఇక నుంచి కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి ఉండడని ఎన్డీయే సర్కార్ తేల్చిచెప్పింది.
ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్ము కశ్మీర్, లఢఖ్ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో కశ్మీర్ కొండల్లో ఆందోళన నెలకొనే అవకాశం ఉండడంతో మరో 8 వేల మంది సైనికులను పంపించారు. వైమానిక దళ ప్రత్యేక హెలికాప్టర్‌లో సైనికులను తరలించినట్టు భద్రతా అధికారులు ప్రకటించారు.. ఆర్టికల్ 370 రద్దవడంతో కశ్మీర్‌లో ఆందోళనలు, పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే వ్యాలీలో భారీగా జవాన్లను మొహరించారు. ఆ . ఈ క్రమంలో భారత వైమానిక దళానికి చెందిన సీ -17 విమానాల ద్వారా శ్రీనగర్‌కు భద్రతా దళాలను పంపించారు. ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా, అసోం ఇతర ప్రాంతాల నుంచి సైనికులను పంపించారు. ఇప్పటికే 35 వేల మంది కశ్మీర్‌లో భద్రతాసిబ్బంది మొహరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 35 వేల మంది మొహరించగా .. మరో 8 వేల మంది పంపించారు. దీంతో కశ్మీర్‌లో 43 వేల మంది బలగాలు తమ విధుల్లో మునిగిపోయాయి. మొత్తంగా జమ్ము కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సంచలనం రేపింది. ఇక జమ్ము కశ్మీర్ లోయలో అల్లర్లు చెలరేగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత..కేంద్రానిదే…అందుకే భారీగా భద్రతాదళాలను జమ్ము – కశ్మీర్‌లో మోహరిస్తోంది.