మోదీ సర్కార్ ఆర్టికల్ 370 ని రద్దు చేయడంతో జమ్మూ కశ్మీర్‌తోపాటు భారత దేశ ముఖచిత్రం కూడా మారింది. ఈ రోజు రాజ్య సభలో జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రాజ్యసభలో ప్రకటించారు. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో జమ్ము – కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా జమ్ము కశ్మీర్ ముఖ చిత్రం కూడా మారింది. జమ్మూ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్ముకశ్మీర్ అవతరించనున్నాయి. లద్దాఖ్ ప్రాంతాన్ని అసెంబ్లీలేని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. దీంతో ఇప్పటి వరకు 29 రాష్ట్రాల భారత ముఖ చిత్రం కూడా మారింది. భారత్‌లో ఇక 28 రాష్ట్రాలు మాత్రమే ఉంటాయి. గత 2014కు ముందు కుడా 28 రాష్ట్రాలు ఉండగా కొత్తగా తెలంగాణ రాష్ట్రం అవతరించడంతో 29కి చేరింది. అయితే తాజాగా కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి రద్దు చేయడంతో పాటు, రాష్ట్రాన్ని జమ్ము కశ్మీర్, లఢఖ్ లుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్రం ప్రకటించింది. దీంతో భారత్‌లో మళ్లీ ఒక రాష్ట్రం తగ్గి, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు పెరిగాయి. మొత్తంగా భారత భౌగోళిక నైసర్గిక ప్రాంతం 28 రాష్ట్రాలు 9 కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారింది.
