టీం ఇండియా కెప్టెన్ ,స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను తన సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి వెస్టిండీస్ తో జరిగిన ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో కోహ్లీ పంతొమ్మిది పరుగులను కేవలం ఒకే ఒక్క బౌండరీతో సాధించాడు. దీంతో ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లో అత్యధిక బౌండరీలను సాధించిన ఆటగాడిగా తన పేరిట రికార్డును సొంతం చేసుకున్నాడు.ఈ మ్యాచ్లో కోహ్లీ కొట్టిన బౌండరీతో ఇంతకుముందు శ్రీలంక బ్యాట్స్ మెన్ దిల్సాన్ (223బౌండరీలు)ను ఆధిగమించాడు ..
