టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల మధ్య మంచి స్నేహం ఉంది. అలాగే చరణ్, మహేష్‌లకు, ఎన్టీఆర్, మహేష్‌లకు మంచి దోస్తానా ఉంది. అలాగే ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్‌ల మధ్య మంచి స్నేహం ఉంది. ఇక స్టార్ డైరెక్టర్ రాజమౌళికి, నిర్మాతలు సాయి కొర్రపాటికి మంచి స్నేహ బంధం ఉంది. ఈ రోజు ఫ్రెండ్‌షిప్‌డే సందర్భంగా ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలను ‘RRR యే దోస్త్’ ట్యాగ్ తో చెప్పండి అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది RRR యూనిట్… . ఎట్ ప్రెజెంట్ ఈ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండీగా మారింది. ఈ పోస్టర్ ద్వారా రామ రాజు, భీం స్నేహం గురించి చెప్పింది. అంతేకాదు మీ లైఫ్ లో కూడా ఇలాగే ఊహించని రీతిలో స్నేహితులుగా మారి మీ లైఫ్‌లో కీలకమైన వ్యక్తులకు ఈ RRRయే దోస్తీ హాష్ ట్యాగ్ ద్వారా విష్ చేయండి అని పేర్కొంది.
ఈ మేరకు ఎన్టీఆర్, రాజమౌళి సహా ఇతర యూనిట్ సభ్యులంతా RRR యే దోస్త్ హాష్ ట్యాగ్‌తో తమ తమ ప్రియ స్నేహితులకు విషెస్ చెబుతున్నారు. నిర్మాత సాయి కొర్రపాటికి రాజమౌళి శుభాకాంక్షలు తెలపగా, ఎన్టీఆర్ చెర్రీకి విష్ చేశారు. ‘ఫ్రెండ్ షిప్ చేసే ముందే మెల్లగా ఆలోచించి దిగండి. ఒక్కసారి ఫ్రెండ్ షిప్ మొదలయ్యాక ఆ స్నేహాన్ని అలాగే స్థిరంగా కంటిన్యూ చేయండి” అని సోక్రటీస్ చెప్పిన వాక్యాలను ట్వీట్ చేస్తూ రామ చరణ్‌తో నా స్నేహ బంధం గురించి ఇంతకుమించి వర్ణించలేను అని పేర్కొంటూ RRRయే దోస్తీ హాష్ ట్యాగ్ ద్వారా ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. ఈ ట్వీట్ చూసి నందమూరి, మెగా అభిమానులు తమ అభిమాన నటుల మధ్య ఏర్పడిన బాండింగ్ చూసి మురిసిపోతునారు. ఇక రాజమౌళి ట్విట్టర్‌లో ఫ్రెండ్‌షిప్ డేపై స్పందించారు. ” గమ్యం చేరేందుకు గాను విధి అనుకూలంగా ఉంటే, జీవితంలో సాయి లాంటి వ్యక్తి తోడవుతాడు. నమ్మకానికి చిహ్నమైన ఆ వ్యక్తి నా జీవితంలో నాకు ఎక్కువ మద్దతిచ్చిన వ్యక్తి. అతను నా భీమ్ నేను అతని ఆనందం తప్ప మరేమీ కోరుకోను” అంటూ RRRయే దోస్తీ హాష్ ట్యాగ్ ద్వారా ట్వీట్ పెట్టారు. ఇది చూసి రాజమౌళికి సాయి కొర్రపాటి ఎంత జాన్ జిగ్రీ దోస్తో కదా అంటూ నెట్‌జన్లు రియాక్ట్ అవుతున్నారు. మొత్తానికి ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.