రవికిషన్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించి.. ఇండస్ట్రీలో బ్లాక్ బ్లాస్టర్ అయిన రేసుగుర్రంలో ప్రధాన విలన్ పాత్రలో నటించిన నటుడని సంగతి విదితమే. ఆ మూవీలో తను ఎమ్మెల్యే కావాలని.. మంత్రి కావాలని కలలు కంటూ అఖరికీ కల తీరకుండానే హీరో అల్లు అర్జున్ చేతిలో దెబ్బలు తింటాడు. అయితేనేమి రీల్ లైఫ్లో ఎమ్మెల్యే కాకపోయిన రీయల్ లైఫ్లో హీరో అయ్యాడు రవి కిషన్..
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్ పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి బీజేపీ తరపున ఎంపీగా గెలుపొందారు రవి.అయితే తాజాగా లోక్ సభ సమావేశాలు జరుగుతున్న సంగతి కూడా తెల్సిందే. ఈ క్రమంలో ఉదయం సమావేశాలకు హజరై తిరిగి ఇంటికెళ్తున్న సమయంలో భారీ వర్షంలో ఒక కారు ప్రమాదానికి గురైంది.
అటుగా వెళ్తున్న రవి వెంటనే తన కారు దిగి కారులో భయంతో కేకలు పెడుతుండటాన్ని గమనించి దిగి రవి వార్ని అక్కున చేర్చుకుని … భయపడకండి.. నేనున్నాను.. అధైర్యపడొద్దని ధైర్యాన్ని నూరిపోసి.. వేరేవాహానంలో వాళ్లను ఇంటికి పంపించే ఏర్పాట్లు చేసి అందరిచేత ప్రశంసలు అందుకున్నాడు ఈ రీయల్ హీరో.. నెటిజన్లు ఫేస్బుక్ ,ట్విట్టర్లో ఈ రీయల్ హీరోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..