జనం ఛీ కొట్టినా టీడీపీ నేతల్లో మార్పు రావడం లేదని, చంద్రబాబు జ్ఞానం మసకబారుతోందనే అనుమానం కలుగుతోందని, దేవినేని ఉమా నోరు అదుపులో పెట్టుకోవాలంటూ…రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. ఇవాళ వియజవాడలో నిర్వహించిన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ…చంద్రబాబు చంద్రబాబు జ్ఞానం మసకబారుతోందనే అనుమానం కలుగుతోందని అన్నారు. పబ్లిసిటీ కోసం ఆయన దిగజారి ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. బందరు పోర్టును తెలంగాణకు ఇస్తున్నామని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి రాజధానిలో పదేళ్ల హక్కుల్ని వదిలేసి.. రాత్రికిరాత్రే పారిపోయి వచ్చింది చంద్రబాబు, లోకేష్ కాదా అని ప్రశ్నించారు. ‘2018 కల్లా పోలవరం పూర్తి చేస్తాం. రాసి పెట్టుకోండి’అని గొప్పలు చెప్పిన చంద్రబాబు ఏం చేశారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టులో కమీషన్ల పేరుతో దండుకున్నారని ఆరోపించారు. అధికారం కోల్పోయినా వారి బలుపు తగ్గలేదని ఎద్దేవా చేశారు.
దేవినేని ఉమ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని నాని హితవు పలికారు. జనం ఛీకొట్టినా టీడీపీ నేతల్లో మార్పురావడం లేదని అన్నారు. రాజకీయంగా బతికున్నానని చెప్పుకోవడానికే బందరు పోర్టుపై కొల్లు రవీంద్ర తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రెండు, ప్రొక్లెయిన్‌లు, జేసీబీ, బోర్‌వెల్ డ్రిగ్గింగ్ మిషన్లతో పోర్టు కడతారా అని ఎద్దేవా చేశారు. ఆ మిషన్లన్నీ బందరు నుంచి అద్దెకు తీసుకొచ్చినవేని చెప్పారు. పోర్టుకు పర్యావరణ అనుమతులు వైఎస్సార్ హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను నెరవేచ్చే నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ప్రశంసించారు. బందరు పోర్టు హామీని కూడా సీఎం జగన్ నిలబెట్టుకుంటారని అన్నారు. మచిలీపట్నం పోర్టును జగన్ తెలంగాణకు అప్పగిస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా లోకేష్‌తో సహా, టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంపై మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. సీఎం జగన్‌పై అడ్డగోలుగా మాట్లాడుతున్న దేవినేని ఉమ నోరు అదుపులో పెట్టుకోవాలంటూ నాని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు.