Home / 18+ / వాట్సాప్‌లో భర్త తలాక్..ముంబైలో త్రిపుల్ తలాక్‌  ఫస్ట్ కేసు నమోదు..!

వాట్సాప్‌లో భర్త తలాక్..ముంబైలో త్రిపుల్ తలాక్‌  ఫస్ట్ కేసు నమోదు..!

ఎన్డేయే ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. దీంతో ఎట్టకేలకు తలాక్ బిల్లు చట్ట రూపం దాల్చింది. రాష్ట్రపతి ఆమోదం, గెజిట్ విడుదలతో దేశవ్యాప్తంగా కొత్తచట్టం అమల్లోకి వచ్చింది. అయితే ఈ చట్టం ప్రకారం అకారణంగా తలాక్ చెప్పిన వారికి మూడేళ్లపాటు జైలు శిక్ష పడుతుంది. ఈ మూడేళ్లు సదరు భర్త..భార్యా పిల్లల పోషణ కోసం భరణం చెల్లించాలి. అంతే కాదు ఈ కేసులో బెయిల్ కూడా ఉండదు. త్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదంతో దేశవ్యాప్తంగా ముస్లిం మహిళలు హర్షం వ్యక్తం చేశారు. అయితే  తాజాగా త్రిపుల్ తలాక్ బిల్లు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత తొలి కేసు ముంబైలో నమోదు అయింది.  ముంబైలోని ముంబ్ర పోలీసు స్టేషన్ పరిధికి చెందిన ఓ మహిళ ఎంబీఏ చేశారు. అయితే మొదటి భర్తతో విడిపోయి ఉంటున్నారు. 2015 సెప్టెంబర్ 7న మరోకరిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లయినప్పటి నుంచే భర్త, అత్తమామలు, ఆడపడుచుల నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి.

కట్నం తీసుకురావాలని వేధింపులకు చేసేవారు. దీంతో ఆ వేధింపులను రెండేళ్లపాటు భరించి .. చివరికి 2017లో తన తండ్రి వద్దకెళ్లిపోయింది. తర్వాత పెద్దలు సర్దిచెప్పి కాపురానికి పంపించారు. టూ వీలర్ కొనివ్వాలని పట్టుబడటంతో యువతి తండ్రి లోన్ తీసుకొని మరీ కొనిచ్చాడు. అయినా అతను మారలేదు. వేధింపులు ఆపలేదు. అంతే కాదు భర్త  మరొకరితో వివాహేతర సంబంధం పెట్టున్నాడని మహిళ గుర్తించింది. కానీ అప్పటికే గర్భవతి అయిన ఆమో ఒకరికి తల్లి అయింది.  ఒకరికి తల్లి అయినా తర్వాత కూడా ఆమె భర్తతో వివాహేతర సంబంధంపై పోరాడుతూనే ఉంది.  అప్పటినుంచి వారి మధ్య వాట్సాప్‌లో కూడా వాగ్వివాదం జరుగుతోంది. వివాహేతర సంబంధం మానుకోవాలని భార్య, కొనసాగిస్తానని భర్త మధ్య చాటింగ్ జరిగింది. అయితే ఇటీవల విసుగుపొందిన భర్త గురువారం రాత్రి 9.30 గంటలకు వాట్సాప్‌లోనే తలాక్ చెప్పాడు.

దేశంలో ట్రిపుల్ తలాక్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత భర్త తనకు వాట్సాప్‌లో తలాక్ చెప్పడంతో సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. తన భర్త తనకు వాట్సాప్‌లో తలాక్ చెప్పాడని పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. స్కీన్ షాట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. తలాక్ చట్టం ప్రకారం అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. ఇదే కాదు 2018 నవంబర్ 30న కూడా ఆమెకు తలాక్ చెప్పాడని ఫిర్యాదు చేసింది.  మంగళవారం ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. దీంతో ఎట్టకేలకు తలాక్ బిల్లు చట్ట రూపం దాల్చింది. రాష్ట్రపతి ఆమోదం, గెజిట్ విడుదలతో దేశవ్యాప్తంగా కొత్తచట్టం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత అధికారికంగా మహారాష్ట్రలో తొలి కేసు నమోదైంది. తలాక్ చట్టం ప్రకారం సదరు భర్తకు మూడేళ్ల వరకు బెయిల్ లభించదు. అతను కోర్టులో కూడా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉండని విషయం తెలిసిందే. మొత్తానికి త్రిపుల్ తలాక్ బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత తొలి కేసు ముంబైలో నమోదు అయింది. మరి ఈ కేసులో పోలీసులు, కోర్టులు ఏ విధంగా వ్యవహరిస్తాయో, బాధితురాలికి ఎలాంటి న్యాయం జరుగుతుందో చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat