తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ్యుల కోటాలో జరగనున్న ఒకే ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ఆ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. పార్టీ తరుఫున నామినేషన్ వేయాల్సిందిగా గుత్తాను ముఖ్యమంత్రి కోరారు.ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిసి గుత్తా కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ల పత్రాల దాఖలు తదితర ప్రక్రియలను నిర్వహించడంలో సహకరించాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డిని సీఎం ఆదేశించారు.
Tags gutta sukhendhar reddy kcr ktr slider telangana mlc elections telanganacm telanganacmo trs trswp