Home / ANDHRAPRADESH / పోలవరం స్పిల‌్‌వేపైకి నీళ్లు రావడంపై గొప్పగా చెప్పుకుంటున్న చంద్రబాబు..ఛీ..సిగ్గుండాలి…!

పోలవరం స్పిల‌్‌వేపైకి నీళ్లు రావడంపై గొప్పగా చెప్పుకుంటున్న చంద్రబాబు..ఛీ..సిగ్గుండాలి…!

పోలవరం ప్రాజెక్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది…గత  రెండు రోజులుగా   కురుస్తున్న వర్షాలతో పాటు గోదావరిలో భారీగా పెరిగిన వరద నీరు ప్రాజెక్టులో కీలకమైన స్పిల్ వేలోకి  వచ్చింది.   అయితే  కాఫ‌ర్ డ్యామ్‌కు గండిప‌డటంతో  స్పిల్‌వేపైకి నీళ్లు వచ్చాయి.  ఇదిలా ఉంటే గోదావ‌రి న‌దీ జ‌లాలు పోలవరం స్పిల్ వే ని తాకడంపై మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు.  ప్ర‌స్తుతం అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయన  స్పిల్ వే పై నుంచి   నీరు ప్రవహిస్తున్న వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు.  ”పాదయాత్రలో పోలవరానికి పునాదులే పడలేదన్న వాళ్ళు, ఈరోజు స్పిల్ వేలో ఉండే రివర్స్ స్లుయీజ్ గేట్ల ద్వారా 2లక్షల క్యూసెక్కుల వరద నీటిని మళ్లించారు. అవహేళనలని, ఆరోపణలని ఎదుర్కొంటూనే 70శాతం నిర్మాణం పూర్తిచేశాం. ఇంతాచేసినా మిగిలిన 30శాతం పూర్తి చేయకపొతే పోలవరం ఒక కలగానే మిగిలిపోతుంది” అంటూ  ట్వీట్ చేశారు.

పోలవరం  స్పిల్‌వేపైకి నీళ్లు రావడం తన ఘనత అన్నట్లుగా తన ట్వీట్ ద్వారా చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు. అసలు ప్రాజెక్టులు కట్టేటప్పుడు నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా నదీ జలాలను మళ్లించేందుకు తాత్కాలిక ప్రాతిపదికన కాఫర్ డ్యామ్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రధాన డ్యామ్ నిర్మాణం పూర్తి కాగానే దీన్ని తొలగిస్తారు. పోలవరంలో ఇలాంటి కాఫర్ డ్యామ్‌లు రెండు ఉన్నాయి. ప్రధానంగా ఆనకట్ట నుంచి నీటిని విడుదల చేసేందుకు నిర్మించే గేట్లతో కూడిన మార్గమే స్పిల్‌వే.  ఈ ఏడాది వ‌ర్షాభావం కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కూ త‌గిన స్థాయిలో ఇన్ ఫ్లో లేకపోవడం వల్ల  ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో ఎటువంటి ఆటంకాలు క‌నిపించ‌లేదు. అయితే, జూలై చివ‌రి వారంలో కురిసిన వ‌ర్షాల కార‌ణంగా గోదావ‌రి ఉప‌న‌దులు ఉప్పొంగడంతో  న‌దీ ప్ర‌వాహం క్ర‌మంగా పెరుగుతూ పోల‌వ‌రం వ‌ద్ద నీటిమట్టం 26 అడుగుల‌కు చేరింది.

పోలవరం కాఫ‌ర్ డ్యామ్‌ వద్ద ఒక్కసారిగా వ‌ర‌ద ప్ర‌వాహం పెరగడంతో  ప‌లు గిరిజ‌న గ్రామాల్లోకి వ‌ర‌ద నీరు వచ్చింది. తూర్పు గోదావ‌రి జిల్లా దేవీప‌ట్నం మండ‌ల కేంద్రం స‌హా 16 గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయి. రెండు రోజుల పాటు ఆయా గ్రామాలు నీటిలో చిక్కుకున్నాయి.   దీంతో ప‌లువురు నిర్వాసితులు ఇండ్లు వదిలి సమీప కొండ ప్రాంతాల్లో ఉంటూ నానా ఇబ్బందులకు గురయ్యారు. అయితే పోలవరంలో పెరుగుతున్న వరద వల్ల కాఫ‌ర్ డ్యామ్‌కు న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం ఉండటంతో, నీటి ప్ర‌వాహానికి అడ్డు తొల‌గించేందుకు స్పిల్ వేకి ఎగువ‌న అడ్డుక‌ట్ట‌ను అధికారులు కొంత‌మేర‌ తొల‌గించారు. ఆ త‌ర్వాత నీటి ప్ర‌వాహం కార‌ణంగా అది పెద్ద గండిగా మారింది. దీంతో ల‌క్ష‌కు పైగా క్యూసెక్కుల వ‌ర‌ద నీరు స్పిల్ వేకి చేరింది.  కాగా ఆగ‌స్టు 1 నుంచి నీటిమ‌ట్టం క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌ట్టింది.  దీంతో బ్యాక్ వాటర్ వెనక్కి వెళ్లడంతో ముంపునకు గురైన గ్రామాలవాసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

కాఫ‌ర్ డ్యామ్ ‌వల్ల 26 అడుగుల నీటిమ‌ట్టానికే ఈ ప‌రిస్థితి తలెత్తితే, ఇక ఈ సీజ‌న్ ముగిసే నాటికి పోలవరానికి మ‌రింత వ‌ర‌ద ఉధృతి వ‌స్తే తమ ప‌రిస్థితి ఏంటని నిర్వాసిత గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం 70 శాతం ప్రాజెక్టులు పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ స్పిల్‌వేపైకి నీళ్లు రావడం నిజంగా బాబు వైఫల్యమే. నిర్వాసితులకు న్యాయం చేయకుండా..గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల పలు గిరిజన గ్రామాలు నీటిలో మునిగాయి. మామూలుగా 54 మీటర్లకు వరద నీరు డ్యామ్ షట్టర్లకు రావాలి..కానీ…25 అడుగుల రావడం విస్మయానికి గురి చేస్తుంది. అసలు కాఫర్ డ్యామ్‌కు గండి పడకపోతే..మరిన్ని గిరిజన గ్రామాలు వరదముంపుకు గురయ్యేవి అని అధికారులు అంటున్నారు.

  ప్రపంచంలో ఎవరు ఏ గొప్ప సాధించినా..ఆ ఘనత నాదే అని బిల్డప్ ఇచ్చే బాబుగారు ఆఖరికి స్పిల్‌వేకు నీళ్లు ప్రవహిస్తే దాదాపు  70 శాతం ప్రాజెక్టు పూర్తి చేశానని చెప్పుకోవడం నిజంగా సిగ్గు చేటు. అసలు ప్రధాన ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇంకా తొలి దశలోనే ఉన్నాయన్న వాస్తవాన్ని చంద్రబాబు ఒప్పుకోక తప్పదు. కాఫర్ డ్యామ్‌‌కు ఎటువంటి ప్రమాదం లేకుండా…అధికారులు ముందు జాగ్రత్తగా తొలగించిన అడ్డుకట్ట వల్ల అక్కడ గండిపడి..స్పిల్‌వేపైకి నీళ్లు ప్రవహిస్తే దానిని కూడా చంద్రబాబు తన ఘనతగా చెప్పుకోవడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat