ప్రస్తుతం బిగ్ బాస్ 3 పై బయట రచ్చ జరుగుతుంది. ఆ షో ప్రారంభం కాకముందే ఎన్నో వివాదాలకు దారితీసింది. హోస్ట్ అక్కినేని నాగార్జున మాత్రం అవేమి పట్టించుకోకుండా షో ను విజయవంతంగా ప్రారంభించి ముందుకు నడిపిస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఓ సినీ నిర్మాత చేసిన ఆ షో పై చేసిన వ్యాఖ్యలు ఆశక్తికరంగా మారాయి. ఈ షో ప్రారంభంలో నాగ్ మాట్లాడుతూ మా నాన్నగారు మా కుటుంబం ఎక్కడ ఉన్న ఆదివారం అయితే అందరు ఒకదగ్గర కలుసుకొని కలిసి భోజనం చెయ్యాలని రూల్ పెట్టారు. అలా చేయడం ఫ్యామిలీ కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చేవని ఆయన అన్నారు. అలాగే హౌస్ లో 15మంది కలిసి ఉంటారని అన్నారు. దీనిపై స్పందించిన ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ షో ని నాగేశ్వరరావు గారి ఆలోచనలతో పోల్చడం బాదేసిందని అన్నారు. ఆయన కుటుంబ విలువలు కోసం ఆలోచించే మనిసి.. కాని బిగ్ బాస్ డబ్బులు కోసం ఆడుతారు అలాంటి షో లో నాన్న గారిని లాగడం మంచిది కాదని తమ్మారెడ్డి అన్నారు.