తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అమెరికా మిన్నెసోట రాష్ట్రంలోని మేయో క్లినిక్‌లో గురువారం టెస్టులు చేయించుకున్నారు.జూలై 28న రాత్రి అమెరికా వెళ్లిన చంద్రబాబు అక్కడ ప్రవాసాంధ్రులు, టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. భార్య భువనేశ్వరితో కలిసి ఓ రెస్టారెంట్‌లో భోజనం చేస్తూ దిగిన ఫోటో రెండ్రోజుల క్రితం వైరల్ అయ్యింది. అయితే మిన్నెసోటలో చంద్రబాబును తెలుగుసంఘాల ప్రతినిధులు జయరామ్ కోమటి, సతీశ్ వేమన, రామ్ చౌదరి కలిశారు. అయితే అసెంబ్లీ సమావేశాలు మానుకుని మరీ చంద్రబాబు అమెరికా వెళ్లడం పట్ల ఆయనకు ఏమైందంటూ ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు చర్చించుకుంటున్నారు.
అమెరికా వెళ్లిన అక్కడి మిన్నెసోటా రాష్ట్రంలోని మేయో క్లినిక్‌లో బాడీ చెకప్ చేయించుకున్నారట.. వయసు మీద పడటంతోపాటు, అనారోగ్యంగా ఉండటంతో ఈ చెకప్ చేయించుకున్నారట. ఈక్రమంలో ఎన్‌ఆర్‌ఐలతో కలిసి చంద్రబాబు మిన్నెసోట వీధుల్లో నడిచారు. అక్కడి రోడ్డు మీద పాప్ కార్న్ కొనుక్కుని తిన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని టీడీపీ శ్రేణులు ప్రమోట్ చేస్తున్నారు. అధికారం పోయిందని తమకి బాధగా ఉన్నా సరే చంద్రబాబు ధైర్యంగానే ఉన్నారనే సంకేతాలిచ్చేందుకు ఈ వీడియో విడుదల చేసారట.. అలాగే ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ కుటుంబంతో కాస్త గడిపే అవకాశం దొరికిందని పార్టీ కార్యకర్తలు సంబరపడుతున్నారు. తమ నాయకుడిగి మనవడితో ఆడుకునే టైం దొరికినందుకు సంతోషిస్తున్నారు.