ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని టీడీపీ సామాజిక మాద్యమాల్లో మరియు టీవీ చానల్స్‌లో ప్రసారం అవుతున్న వార్తపై అంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ తీవ్రంగా ఖండించింది. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన ఆర్బీఐ ఈ-కుబేర్ (ఈ-కుబేర్ పద్ధతిలో వేతనాలు రిజర్వ్ బ్యాంకు నుంచి నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో ప్రతి నెలా 1న జమ అవుతాయి) ద్వారా చెల్లింపులు జరుగుతాయి. ఈ ప్రకారంగానే అన్ని జిల్లాల పింఛన్లు, జీతాల ఫైళ్లు యథాతథంగా జులై 31నే ఆర్బీఐకి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ పంపడం జరిగింది. 1వ తేదీ మధ్యాహ్నంకు పింఛన్లు పూర్తిగా, కొన్ని జీతాల ఫైళ్లు చెల్లించాం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ-ముద్ర ద్వారా పొందిన సర్టిఫికెట్లు పని చేయకపోవడం వల్ల మిగిలిన ఫైళ్లు చెల్లింపు ఆలస్యం అయిందని వివరణ ఇచ్చారు. అనంతరం సమస్యను పరిష్కరించి మిగతా జీతాలు కూడా చెల్లించడం జరిగింది. దీన్నే టార్గెట్ చేసిన టీడీపీ అండ్ కో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని హెచ్చరించారు.
