Home / MOVIES / దుమ్ములేపుతున్న “సాహో”రొమాంటిక్ సాంగ్

దుమ్ములేపుతున్న “సాహో”రొమాంటిక్ సాంగ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సాహో చిత్రం ఆగ‌స్ట్ 30న గ్రాండ్‌గా విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే . దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్‌తో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. అయితే చిత్ర రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న క్ర‌మంలో మేక‌ర్స్ వినూత్న‌మైన ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. ఇప్ప‌టికే సాహో చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోస్‌తో పాటు పోస్ట‌ర్స్ , సాంగ్స్ విడుద‌ల చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇటీవ‌ల‌ ఏ చోట నువ్వున్నా అనే సాంగ్‌కి సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల చేశారు.

కృష్ణ‌కాంత్ లిరిక్స్ అందించిన ఈ పాట‌ని శేషాద్రి, తుల‌సీ కుమార్ ఆల‌పించారు. గురు రంధ్వా సంగీతం అందించారు. ఈ పాట‌లో ప్ర‌భాస్ లుక్ అదిరింది. విజువ‌ల్స్ కూడా అందంగా ఉన్నాయి. తాజాగా ఫుల్ వీడియో సాంగ్ విడుద‌ల చేశారు. సాహో చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మ‌ళ‌యాల భాషల్లోనూ విడుద‌ల చేస్తున్నారు. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ, లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. శంక‌ర్ ఎహ‌సాన్ లాయ్ త‌ప్పుకున్న త‌ర్వాత ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ప్ర‌భాస్ స‌ర‌స‌న శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న విష‌యం విదిత‌మే. `బాహుబ‌లి` త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తోన్న చిత్రం కావ‌డంతో `సాహో`పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat