Home / ANDHRAPRADESH / టీడీపీ నుంచి కోడెల ఫ్యామిలీ సస్పెన్షన్…లోకేష్ అంత ధైర్యం చేస్తాడా…?

టీడీపీ నుంచి కోడెల ఫ్యామిలీ సస్పెన్షన్…లోకేష్ అంత ధైర్యం చేస్తాడా…?

నవ్యాంధ‌్రప్రదేశ్ తొలి స్పీకర్‌గా వ్యవహరించిన కోడెల శివప్రసాద్ వ్యవహార శైలి పూర్తిగా వివాదస్పదం. గత ఐదేళ్ల చంద్రబాబు హాయంలో రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉంటూ, ఫక్తు తెలుగుదేశం నాయకుడిగా,  రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించిన  కోడెల శివప్రసాద్ స్పీకర్ల వ్యవస్థకే మచ్చ తెచ్చారనడంలో సందేహం లేదు. చంద్రబాబు నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నా, కనీసం పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు చేయకుండా కోడెల మీనమేషాలు లెక్కించారు. సభా మర్యాదలను పాటించకుండా…అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుడు జగన్ మైక్ కట్ చేస్తూ, టీడీపీ నేతలకు వంత పాడారు. ఇక స్పీకర్‌గా ఉంటూనే అసెంబ్లీ చివరి సమావేశంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకుని హుందాతనాన్ని కోల్పోయారు కోడెల. ఇక నరసరావుపేట, సత్తుపల్లిలో స్పీకర్ కోడెల కుమారుడు శివప్రసాద్, కూతురు విజయలక్ష్మీలు తన తండ్రి అధికారాన్ని,  హోదాను అడ్డుకుపెట్టుకుని ” కే” ట్యాక్స్ పేరుతో చెలరేగిపోయారు. భూకబ్జాల నుంచి రియల్ ఎస్టేట్ దందాల వరకు కోడెల కుమారుడు, కూతురి దౌర్జన్యాలకు అడ్డే లేకుండా పోయింది. కోడెల అనుచరుల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ కే ట్యాక్స్ వసూలు చేసేవారు. కోడెల పుట్టిన రోజులకు చికెన్ షాపులు, స్వీట్‌షాపులు, ఫ్లవర్ డెకరేషన్ షాపుల నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్ల వరకూ కే ట్యాక్స్ చెల్లించాల్సి వచ్చేంది. గత ఐదేళ్లు మౌనంగా భరించిన “కే “ట్యాక్స్ బాధితులు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల ఫ్యామిలీ దౌర్జన్యాలపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. వందలాదిగా కే ట్యాక్స్ బాధితులు పోలీస్ స్టేషన్లకు తరలి రావడంతో పోలీసులు కోడెల కుమారుడు, కూతురిపై కేసులు నమోదు చేశారు.

ఇక నిబంధనలకు విరుద్దంగా గుంటూరు జిల్లాలో కేబుల్ వ్యాపారం నిర్వహించిన కోడెల శివరామకృష్ణ.. పలువురు వ్యాపారులను మోసం చేసి మరీ రూ.70 కోట్లకు పైగా వెనుకేసుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు గత రాత్రి నుంచి కోడెల శివరాం కి సంబందించి హైదరాబాద్, గుంటూరుల లోని పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఢిల్లి పోలీసులతో పాటు ఈడి అధికారులు కూడా పాల్గొన్నారు. కోడెల కుమారుడు పైరసీ ద్వారా కేబుల్ కనెక్షన్ వ్యాపారం చేసి సుమారు 70 కోట్ల రూపాయలు కేబుల్ కంపెనీలకు ఎగ్గొట్టినట్లు కోర్టు కి ఈడీ ఆధారాలు సమర్పించాయి. దీంతో కేసుల భయంతో కోడెల కుమారుడు శివరామకృష్ణ , కూతురు విజయలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.    ఈ  కేసులతో కోడెల కుటుంబీకుల మీద ఉచ్చు గట్టిగా బిగుసుకుంటోందనే టాక్ వినిపిస్తోంది. కోడెల ఫ్యామిలీ అరాచకాలు టీడీపీకి పూర్తి డ్యామేజీగా మారాయి.  పార్టీలో సీనియర్  నేత కావడంతో చంద్రబాబు, లోకేష్‌లు మింగలేక, కక్కలేక సతమతమవుతున్నారు. నరసరావుపేట, సత్తుపల్లిలో కోడెల కుటుంబం సాగించిన అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు ఎవరూ కోడెల ఫ్యామిలీకి మద్దతుగా మాట్లాడడం లేదు.

కోడెల ఫ్యామిలీ అవినీతి దందా టీడీపీకి తలనొప్పిగా మారింది. ఇప్పటికే బాబుగారి హయాంలో జరిగిన అవినీతి బాగోతాలపై సీఎం జగన్ విచారణ జరిపించేందుకు రెడీ అవుతుండడంతో బాబు, లోకేష్‌లతో పాటు టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దీంతో కోడెల కుటుంబాన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేసే విషయమై లోకేష్‌ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కోడెల కుటుంబం రాజకీయంగా పతనమైందని, మళ్లీ గుంటూరు జిల్లాల్లో టీడీపీ పుంజుకోవాలంటే కోడెల ఫ్యామిలీని వదిలించుకోకతప్పదని లోకేష్‌కు కొంత మంది టీడీపీ నేతలు సలహా ఇచ్చారని సమాచారం. అయితే చంద్రబాబుకు కోడెల ఫ్యామిలీ మీద పెద్దగా సానుకూలత లేకపోయినా, పార్టీలో సీనియర్ నేత కావడంతో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు.  కోడెల విషయంలో తొందరపడవద్దని, కొంత కాలం తర్వాత పరిస్థితులు అవే సర్దుకుంటాయని బాబు, లోకేష్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే లోకేష్ మాత్రం అవినీతి మరక పోవాలంటే..కోడెల ఫ్యామిలీని పార్టీ నుంచి బయటకు పంపే ఆలోచనలో ఉన్నాడట..అయినా లోకేష్‌ పిచ్చి కానీ…కోడెల ఫ్యామిలీని సస్పెండ్ చేసినంత మాత్రాన గత ఐదేళ్ల బాబు ప్రభుత్వంపై పడిన అవినీతి మరక పోతుందా ఏంటీ…మొత్తానికి కోడెల ఫ్యామిలీని బహిష్కరించేందుకు టీడీపీలో రంగం సిద్ధమవుతున్నట్లు జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి. అయితే లోకేష్‌కు కోడెల ఫ్యామిలీని బహిష్కరించే దమ్ముందా…అంటూ తెలుగు తమ్ముళ్లు తమలో తాము గుసగుసలాడుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat