చలిలో చంకలో ఫైల్స్ పట్టుకొని వీధివీధికి తిరిగి లక్షలకోట్లు పెట్టుబడులు తెచ్చాను.. ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తోంది అని చెప్పుకునే చంద్రబాబు.. అక్కడి ఫొటోలతో హడావిడి చేసే ఆయన బ్యాచ్ తో కలిసి ఇప్పుడు శెనగిత్తనాలు తింటూ ఉత్తచేతులతో అదే బజార్లో తిరుగుతున్నారు. అయితే గతంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కూడా చేసింది ఇదే పని అంటూ ఆయనను విమర్శిస్తున్నారు. కాకపోతే అప్పుడు అధికారంలో ఉండటంతో చుట్టూ సూటు బూటు వేసుకొని మెడలో టైలు కట్టుకొని అమరావతి నుంచి చాలామంది అక్కడకు వెళ్లి ఫొటోలు దిగి ఆ బొమ్మలన్నీ ఇక్కడ చూపెట్టి లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయంటూ చంద్రబాబు అనుకూల పచ్చ పత్రికలన్నీ ప్రచారం చేసేవి.. అయితే ఇప్పుడు అధికారంలో ఉండే హంగులూ ఆర్భాటాలు లేకపోవడంతో ఆయన చుట్టూ ఉండే బ్యాచ్ ఒక్కటే మిగిలింది అంటున్నారు. అప్పుడైనా ఇప్పుడైనా చంద్రబాబు చేసేది బజార్లో పల్లీలు తింటూ తిరగటమేనని, అంతకుమించి ఎప్పుడూ రూపాయి పెట్టుబడి తెచ్చింది లేదంటున్నారు వైసీపీ సైనికులు.. మరికొందరైతే బిల్ గేట్స్ కు కంప్యూటర్ నేర్పించినవాడివి.. నువ్వు శనగలు తినడమేందయ్యా.. పెపంచ మేధావిని ఆంగ్లేయులు గుర్తుపట్టక పోవడం బాధాకరం అంటూ సెటైర్లు వేస్తున్నారు.
