ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న యాషెస్ సిరీస్ లో మొదటిరోజే చాలా ఆశక్తికరంగా ప్రారంభమైంది. ఇంకా చెప్పాలి అంటే ఆస్ట్రేలియా ప్రమాదం అంచులవరకు వెళ్లి వచ్చిందని చెప్పాలి. టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చిన స్మిత్ తన అద్భుతమైన ఆటతో టీమ్ ను కష్టాల నుండి బయటకు తీసుకొచ్చాడు. అయితే ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న ఆసీస్ కు తాము తీసుకున్న నిర్ణయం తప్పు అని కాసేపటికే అర్దమైంది. ఇంగ్లాండ్ పేసర్లు బ్రాడ్, వోక్స్ దెబ్బకు 122 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా పని అయిపొయిందని అందరు అనుకున్నారు. కాని స్మిత్ కు తోడుగా సిడిల్ ఉండడంతో అదికాస్తా 284పరుగులకు వెళ్ళింది. అద్భుతమైన బ్యాట్టింగ్ తో 144 పరుగులు సాధించి టీమ్ కు అండగా నిలిచాడు.
