నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అత్యంత ఆప్తుడైన ..శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమితులైన రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డికి ప్రభుత్వం కేబినెట్ ర్యాంక్ కల్పించింది. అలాగే ప్రభుత్వ విప్‌లుగా నియమితులైన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సామినేని ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ముత్యాల నాయుడు, దాడిశెట్టి రాజాకు సహాయ మంత్రి హోదా కల్పించింది. ఈ మేరకు
సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.
