ప్రత్యర్థులపై ఘాటైన పదజాలంతో వ్యాఖ్యలు చేసే టీడీపీ ఎమ్మెల్యేలలో ఇద్దరు ఉమాలు ముందు వరుసలో ఉంటారు. ఒకరు దేవినేని ఉమా అయితే…ఇంకొకరు దేవినేని కంటే రెండాకులు ఎక్కువే చదివిన బోండా ఉమ. అసెంబ్లీ అయినా, ప్రెస్మీట్లు, అయినా బహిరంగ సభలోనైనా ప్రత్యర్థులపై బూతు పదజాలంతో తిట్టడంలో బోండా స్టైలే వేరు. గత అసెంబ్లీలో కొడాలి నానిని రేయ్…రేయ్…పాతేస్తా..నా కొ..కా..అంటూ బూతులు లంకించుకున్న బోండా ఉమను తెలుగు ప్రజలు మర్చిపోలేదు. ఒక్క ప్రత్యర్థులనే కాదు…సొంత పార్టీ నేతలపై కూడా తీవ్ర విమర్శలు చేయడానికి వెనుకాడరు. ఎంతగానో ఆశలు పెట్టుకున్న మంత్రి పదవి రాకపోయేసరికి చంద్రబాబు..మా కాపుల గొంతు కోశాడు…ఏకంగా నాటి ముఖ్యమంత్రి బాబుగారిపైనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అనుచరులు, కొడుకు వల్ల ఎంతగా అప్రతిష్ట పాలైనా, ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా బోండా ఉమ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తన పట్టును నిలుపుకునేవారు. కానీ గత ఎన్నికల్లో జగన్ హవాలో రాష్ట్రమంతటా టీడీపీ ఘోర పరాజయం చెందినా..బోండా ఉమ వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో కేవలం 25 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉన్న బోండా ఉమ త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని బెజవాడలో చర్చ జరుగుతోంది. అయితే బోండా ఉమ మాత్రం పార్టీ మార్చే విషయం ఏమి బయటకు చెప్పకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టూర్లో ఎంజాయ్ చేస్తున్నాడు. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియాలో టీడీపీ అభిమానులు కొంత మంది బోండా ఉమను మర్యాదపూర్వకం కలవాలని ప్రయత్నిస్తే ఆయన వారికి నో చెప్పాడు. దీంతో ఆశ్చర్యపోవడం టీడీపీ నేతల వంతు అయింది. స్వయంగా పార్టీ అభిమానులు వచ్చినా బోండా ఉమ కలవడానికి ఇష్టపడకపోవడంతో ఆయన త్వరలో పార్టీని వీడడం ఖాయమని బెజవాడ టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే బోండా ఉమ మాత్రం కూల్‌గా విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు.
న్యూజిలాండ్‌లో ఏకంగా బంగీ జంపే చేశారు. సేమ్ టు సేమ్ ఈ బంగీ జంప్‌ను బావగారు బాగున్నారా సినిమాలో మెగాస్టార్ చిరు చేశాడు. రాజకీయ నాయకుల్లో వైయస్ జగన్ చేశారు. కానీ ఓ నడి వయసులో ఉన్న బోండా ఉమ బంగీ జంప్ చేయడం ఓ రకంగా సాహసమే అని చెప్పాలి. తన బంగీ జంప్ వీడియోను పోస్ట్ చేస్తూ.. జీవితాన్ని సాహసవంతమైన క్రీడగా అభివర్ణించాడు బోండా. అయితే తాను సాహసం చేసేందుకు సిద్ధం అయినట్లు చెబుతూ బంగీజంప్ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన బెజవాడ తెలుగు తమ్ముళ్లు మాత్రం బంగీ జంప్ సరే.. పార్టీ జంప్ ఎప్పుడు బోండా ఉమ అంటూ సరదాగా కౌంటర్ వేస్తున్నారు. మొత్తానికి బంగీ జంప్‌తో మరోసారి బోండా ఉమ వార్తల్లో నిలిచారు.