తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మాణాలను చేపట్టిన సంగతి తెలిసిందే. అసెంబ్లీని ఎర్రమంజిల్‌లో నిర్మిస్తుండడంతో పురాతనమైన ఎర్రమంజిల్ బిల్డింగ్‌ను ప్రభుత్వం కూల్చివేస్తుందంటూ ప్రతిపక్షాలు రాగాలు మొదలుపెట్టాయి. చారిత్రక భవనాలను కూల్చి వేతపై కొందరు హైకోర్ట్‌కు వెళ్లగా ఈ రోజు హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ రోజు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటీషనర్లకు న్యాయమూర్తుల బెంచ్ కొత్త అసెంబ్లీని ఎందుకు నిర్మించుకోకూడదని పిటీషనర్లకు సూటిగా అడిగింది. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సాధించుకున్న తెలంగాణలో కొత్త అసెంబ్లీని ఎందుకు నిర్మించుకోకూడదని హైకోర్టు ప్రశ్నించింది. . “ఇప్పుడున్న అసెంబ్లీ చాలడం లేదని సర్కార్ చెబుతోంది. భావితరాలకు ఉపయోగపడేలా అన్ని హంగులతో కొత్తగా కట్టడం వల్ల నష్టం ఏముంది. హర్యానా–పంజాబ్ విడిపోయినప్పుడు అమృతసర్, పాటియాల వంటి సిటీలు ఉన్నా కొత్తగా చండీఘర్‌ను కట్టారు. భోపాల్‌లో అసెంబ్లీ కట్టారు. కర్నాటకలోనూ కట్టారు. రాష్ట్రాలు విడిపోకున్నా కొత్త అసెంబ్లీలు కడుతున్నరు. అలాంటప్పుడు కొత్త రాష్ట్రంలో కడితే ఎట్లా తప్పు అవుతుంది” అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్అక్తర్‌లతో కూడిన డివిజన్ బెంచ్.. పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.
అయితే కొత్త అసెంబ్లీ కట్టేందుకు మాకు అభ్యంతరం లేదు. పురాతనమైన ఎర్రమంజిల్ బిల్డింగ్ కూల్చేయాలనే నిర్ణయాన్నే మేం ప్రశ్నిస్తున్నాం. చట్ట ప్రకారం చేయకపోడాన్ని సవాల్ చేస్తున్నాం.. అని పిటిషనర్ లాయర్ బదులిచ్చారు. హెరిటేజ్ భవనాలను రక్షించడం ప్రభుత్వం బాధ్యత అని తెలిపారు. ఈ దశలో జోక్యం చేసుకొన్న ధర్మాసనం.. హెరిటేజ్ భవనాల జాబితాలో మార్పులు చేసే అధికారం హెచ్‌ఎండీఏకు ఉన్నదా? లేదా? తెలుపాలని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.కేసీఆర్ సర్కార్ కొత్త అసెంబ్లీ నిర్మాణం చేపట్టడం ఏ విధంగా తప్పు అవుతుంది అంటూ హైకోర్ట్ సూటిగా ప్రశ్నించడంతో పిటీషనర్లకు దిమ్మతిరిగినట్లయింది. దీంతో ఢిఫెన్స్ పడ్డ పిటీషనర్ల న్యాయవాది కొత్త అసెంబ్లీ కట్టేందుకు మాకు అభ్యంతరం లేదు..పురాతనమైన ఎర్రమంజిల్ బిల్డింగ్ కూల్చివేతనే మేం ప్రశ్నిస్తున్నామంటూ ప్లేట్ ఫిరాయించాడు. మొత్తానికి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా గుడ్డిగా వ్యతిరేకిస్తూ కోర్టులకు ఎక్కుతున్న ప్రతిపక్షాలకు ఈ రోజు హైకోర్ట్ ఇచ్చిన తీర్పు నిజంగా చెంపపెట్టులాం