మహిళల సంక్షేమం కోసమే స్త్రీనిధి, మెప్మా, సెర్ప్‌లు ఏర్పాటు అయ్యాయన్నారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. స్త్రీ నిధి కరపత్రాన్ని విడుదల చేసిన ఎర్రబెల్లి ఆపదలో ఉన్న పేద మహిళలను ఆదుకోవడమే స్త్రీనిధి ఉద్దేశ్యమన్నారు. టెక్స్‌టైల్ పార్క్ విషయంలో తనపై వచ్చిన కథనాలు తప్పు అన్నారు ఎర్రబెల్లి. తాను ఎవరిని బెదిరంచలేదని….. పనులు ఆలస్యంగా జరుగుతున్నందున అక్కడికివెళ్లి అడిగానని చెప్పారు. ఒక్కరి వల్ల మొత్తం పని ఆగిపోతుందని నా శిష్యుణ్ని ఉద్దేశించి అన్నట్లుగా తెలిపానని చెప్పారు. రుణం తీసుకున్న మహిళ దురదృష్టవశాత్తు చనిపోతే బీమా వర్తిస్తుందన్నారు. రుణ బకాయిలను బీమా సంస్థే చెల్లించేలా రుణ సురక్ష కార్యక్రమం ఉందన్నారు.