ఢిల్లీ వాసులకు ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కరెంట్ బిల్ ఫ్రీ అని చెప్పడంతో ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఎవరైనా సరే 200యూనిట్లు లోపు కరెంటు వినియోగిస్తే వారికి బిల్లు ఉండదని సీఎం ప్రకటించారు. దీనిని ఫ్రీ లైఫ్ లైన్ ఎలక్ట్రిసిటీ స్కీమ్ కింద సీఎం కేజ్రీవాల్ అమ్మల్లోకి తీసుకొస్తున్నారు. ఇది ఈ ఆగష్టు నెల నుండే వర్తిస్తుందని చెప్పడం జరిగింది. అంతే కాకుండా 200 యూనిట్లు నుండి ఆ పై 400 యూనిట్లు వరకు వాడుకునే వాళ్లకు 50% సబ్సిడీ కూడా ఇస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
తమ ప్రభుత్వం ఆమ్ ఆద్మీకి ఇచ్చే కానుక ఇది అని అన్నారు. ఐదేళ్లలో కరెంట్ చార్జీలు పెంచని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తమదేనని అన్నారు. అంతేకాకుండా అతి తక్కువ ఖర్చుతో కరెంట్ అందిస్తున్న రాష్ట్రం కూడా ఢిల్లీనే అని కేజ్రీవాల్ అన్నారు. ఈ పథకం వల్ల 33% కుటుంబాలకు మేలు జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. చిన్నపాటి కుటుంబాలకి ఇది ఒక గొప్ప వరంలాంటిదని అన్నారు.ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే మరికొద్ది నెలల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపద్యంలో జనాల మనసులు గెలుచుకోవాలని ఇలాంటి పథకాలు పెడుతున్నారని ప్రతిపక్షాలు చెప్పుకొస్తున్నాయి.