టాలీవుడ్ లో సరికొత్త అద్భుతానికి నాంది పలికి ఈరోజుకి పదేళ్ళు పూర్తయింది. ఈ అద్భుతంలో ముఖ్య పాత్ర మెగాస్టార్ తనయుడిదే. అది మరేదో కాదు జక్కన్న వదిలిన మగధీర చిత్రం. ఈ చిత్రం పదేళ్ళ క్రితం అంటే 2009 జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చి టాలీవుడ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రం విడుదలైన మొదటిరోజు నుండి 50రోజుల వరకు థియేటర్లు ఉక్కిరిబిక్కిరి అయ్యిపోయాయని చెప్పాలి. జక్కన్న చేతిలో పడ్డ చరణ్ కు ఇది ఒక పెద్ద బ్లాక్ బ్లాస్టర్ అని చెప్పాలి. 78ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో మొట్టమొదటిసారిగా 302 కేంద్రాల్లో 50 రోజులు 223 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుని మగధీర సునామి సృష్టించింది.