కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ మృతి చెందిన తీరు తనను షాక్కు గురిచేసిందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. కర్నాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్థ.. మంగుళూరు వద్ద ఉన్న నేత్రావతి నదిలో పడి ఆత్మాహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతని మృతదేహాన్ని ఇవాళ ఉదయం జాలర్లు గుర్తించారు. సిద్ధార్థ చనిపోయిన తీరు తనను బాధకు గురిచేసిందని కేటీఆర్ అన్నారు. కొన్ని ఏళ్ల క్రితం ఆయన్ను ఓ సందర్భంలో కలిసినట్లు కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. చాలా స్నేహిపూర్వకమైన వ్యక్తి అని, మృదు స్వభావి, సౌమ్యుడు అని కేటీఆర్ తన ట్వీట్లో చెప్పారు. ఇలాంటి విపత్కర సమయంలో.. సిద్ధార్థ కుటుంబసభ్యులకు, స్నేహితులకు, కాఫీ డే ఉద్యోగులకు మనోధైర్యం లభిస్తుందని ఆశిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
Saddened & shocked at the way #VGSiddhartha ended his life. Had an opportunity to meet him briefly a few years ago; found him affable & gentle. RIP
Hope his family & friends at CCD find strength in this difficult time
— KTR (@KTRTRS) July 31, 2019