అవసరానికి మించి దుబారా.. సర్వం దోపిడీ.. అప్పుల మీద అప్పులు…ఇది గత ఐదేళ్ల చంద్రబాబు పాలన… అడ్డగోలుగా ప్రభుత్వ నిధులను దుబారా చేస్తూ, అందినకాడిని తన తాబేదార్లకు పంచిపెట్టిన చంద్రబాబు ఏపీని అప్పుల ఆంధ‌్రప్రదేశ్‌గా మార్చేశారని స్వయంగా కాగ్ రిపోర్ట్ తేల్చి చెప్పింది. 2017 -18 FRBM చట్టం ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తి లో అప్పులు 25 .09 శాతం ఉండాల్సి ఉండగా 32 .30 శాతం ఉంది. ఇక ద్రవ్యలోటు 3 శాతం మించకూడదు కానీ 4 .03 శాతం ఉంది.కేవలం 3.26 శాతము ఉండాల్సిన రెవెన్యూ లోటు ఏకంగా 15 .37 శాతం ఉంది.రాష్ట్ర స్థూల ఉత్పత్తి 8,03,873 కోట్లు అయితే అప్పులు 2,59,670 కోట్లు ఉన్నాయి. 2014 -15 నుంచి 2017 -18 వరకు బాబు ప్రభుత్వం వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్ళింది.
వేస్ అండ్ మీన్స్ అంటే ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం నడపడానికి సరిపడా డబ్బు లేకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచినుంచి కనీస ఆవసరాలకు అప్పు చేయడం, (మామూలు భాషలో చేబదులు అంటారు) ఈ అప్పు కూడా 90 రోజుల్లో తీర్చాలి,తీర్చ లేకుంటే తరువాత ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. అప్పుడు ప్రభుత్వం చెలించాల్సిన వడ్డీ కూడా పెరుగుతుంది. ఈ ఓవర్ డ్రాఫ్ట్ అనేది 14 పని దినాల్లో తీర్చాలి.
మొత్తంగా చంద్రబాబు ప్రభుత్వం 2015 -16 ఆర్ధిక సంవత్సరం లో 259 రోజులు
2016 -17 ఆర్ధిక సంవత్సరం లో 250 రోజులు ,
2017 -18 ఆర్ధిక సంవత్సరం లో 188 రోజులు ,
వేస్ అండ్ మీన్స్ కు 2017 -18 లో అయితే ఏకంగా 43 రోజుల పాటు ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్ళింది. పదేళ్ల కాంగ్రెస్ హయాంలో కూడా ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లిన దాఖలాలు లేవు. మహా మేధావి, ఆర్థిక నిపుణుడిని, దావోస్‌కు వెళ్లి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే సలహాలు ఇచ్చానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు హయాంలో ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లని రోజు లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దుస్థితి కూడా బాబు హయాంలోనే ఏర్పడింది.
ఇక రెవెన్యూ లోటుకు తోడు ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉందని కాగ్ తెలిపింది. ఆదాయం రూ.లక్షా 5వేల కోట్లు మాత్రమే ఉందని తేల్చింది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2018 మార్చి 31వ వరకు రూ.16,151 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడిందని పేర్కొంది. రెవెన్యూ లోటుతో పాటు అప్పులు పెరిగితే అందుకు తగ్గట్టుగా మూలధన ఆస్తులు పెరగాల్సి ఉండగా రూ.28,203 కోట్ల అప్పులు చేస్తే 16,272 కోట్ల మేర ఆస్తులు మాత్రమే పెరిగాయని తెలిపింది. నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని ఆర్థికమంత్రి బుగ్గన ఆరోపించారు.
ఇది దుబారా బాబు గారి ఘనత. పెట్టుబడులు తెస్తామంటూ విదేశాలకు ఫ్లైట్లు వేసుకుని, విలాసవంతమైన హోటళ్లలో ఉంటూ, అక్కడ ఖరీదైన ఫుడ్ తింటూ ఎంజాయ్ చేసిన బాబుగారి తప్పులే…ఇప్పుడు ఏపీకి అప్పుల తిప్పలు. ఐదేళ్లు ప్రభుత్వ సొమ్మును నీరు, చెట్టూ అంటూ, రాజధాని, పోలవరం పేరుతో, తాను దోచుకుని, తన పార్టీ వాళ్లకు దోచి పెట్టిన చంద్రబాబు చివరకు ఏపీని అప్పుల పాలు చేశాడు. ఇది 40 ఏళ్ల అనుభవం ఉన్న బాబుగారి ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనం.కాగ్ ఎన్ని అక్షింతలు వేసినా చంద్రబాబు పట్టించుకోకుండా అప్పుల మీద అప్పులు చేస్తూ ఏపీని అప్పుల ఆంధ‌్ర ప్రదేశ్‌గా మార్చారు. అందుకే సీఎం అయిన తర్వాత జగన్ ఆర్థిక క్రమ శిక్షణ పాటిస్తూ, ఏపీని అప్పుల బారి నుంచి బయటపడేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. 40 ఏళ్ల అనుభవం అంటూ బాబు చేసిన ఈ పాపం..ఏపీ ప్రజలకు శాపంగా మారింది.