టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనికు ఆర్మీ అధికారులు డ్యూటీ వేసారు. ఇప్పటికే ధోని ఆర్మీ లో ట్రైనింగ్ కొరకు 2నెలలు జట్టు నుండి తప్పుకున్న విషయం అందరికి తెలిసిందే. అందుకే వెస్టిండీస్ టూర్ నుండి ధోని తప్పుకున్నాడు. అయితే ఆర్మీ విధుల్లోకి చేరిన ధోనికి అధికారులు గార్డు డ్యూటీ వేసారు.అతడు పెట్రోలింగ్ మరియు అవుట్ పోస్ట్ డ్యూటీ చెయ్యాల్సిందే. ఈ మేరకు విక్టరీ ఫోర్సు కమాండ్ తో కలిపి ధోనికి 15 రోజులు ట్రైనింగ్ ఇవ్వనున్నారు అధికారులు.
