భారత జట్టుకు కొత్త కోచ్ వెతకడంలో బీసీసీఐ జోరుగా ఉందని చెప్పాలి. ఈ మేరకు ఇప్పటికే బోర్డ్ దరఖాస్తులు కోరుతూ ప్రకటనలు కూడా విడుదల చేసింది. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి కి వరల్డ్ కప్ తో తన కాంట్రాక్టు పూర్తి అయినప్పటికీ వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటన ఉండడంతో మరో 45రోజులు కాంట్రాక్టును పొడిగించడం జరిగింది. హెడ్ కోచ్ తో పాటు సహాయ సిబ్బంది కూడా ఈ 45రోజులు ఉంటారు. అయితే కోచ్ విషయంపై స్పందించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి సంచలన వ్యాఖ్యలు చేసాడనే చెప్పాలి. అసలు ఏమన్నాడాంటే రావిశాస్త్రితో మాకు మంచి సంబందాలు ఉన్నాయని, అతడి ప్రయాణంలో మేము చాలా విజయాలు సాధించామని. అతనే మల్లా మాకు కోచ్ గా ఉంటే బాగుంటుందని చెప్పాడు. కోచ్ విషయంలో ఇప్పటివరకు అయితే బోర్డ్ నన్ను సంప్రదించలేదని ఒకవేళ అదేగాని జరిగితే నేను కచ్చితంగా అతనినే సపోర్ట్ చేస్తానని అన్నాడు.