గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ముఖ్యంగా శ్రీపాదసాగర్ ఎల్లంపల్లి జలాశయ పరివాహాక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ వరద నీరు చేరుతుండడంతో తాత్కాలికంగా మేడిగడ్డ, అన్నారం పంప్హౌసు నుంచి ఎగువకు నీటిని పంప్చేయడం ఈ రోజు మధ్యాహ్నం నిలిపి వేశారు.
అయితే సుందిళ్ల పంప్హౌస్లో పంపింగ్కు సంబంధించి పూజా కార్యక్రమాలు ఈ రోజు సాయంత్రం పూర్తయ్యాయి. ఈ రాత్రికి గాని లేదా రేపు ఉదయం గాని సుందిళ్ల నుంచి నీటిని ఎల్లంపల్లికి ప్రయోగాత్మకంగా పంపింగ్చేసి పరీక్షించనున్నారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి నీటి పంపింగ్ కొనసాగిస్తారు.
ప్రస్తుతానికి మేడిగడ్డ, అన్నారం పంప్హౌస్ల్లో నీటి పంపింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రాణహిత వరద నీటిని ఎగువకు పంప్చేసి అక్కడి నుంచి ఎల్లంపల్లి జలాశయం ద్వారా ప్యాకేజ్-6,8 పంప్హౌస్ నుంచి నీటిని మిడ్మానేరుకు పంప్చేసే విధంగా కాళేశ్వరంలో లింక్-1 మరియు లింక్-2 పనులు పూర్తిచేశారు. ఈ నెల 21 నుంచి మేడిగడ్డ ఆ తర్వాత అన్నారం పంప్హౌస్ నుంచి ప్రాణహిత నీటిని ఎగువకు పంప్చేయడం ప్రారంభించారు.
ఈ రాత్రికి సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి నీటిని పంప్చేయాలి. అయితే ప్రస్తుతం ఎల్లంపల్లి జలాశయానికి కడెం ప్రాజెక్ట్ నుంచి వరద నీరు చేరుతోంది. కనీసం 20వేల క్యుసెక్కులు మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. దాంతో ఎల్లంపల్లి జలాశయం ఈ వరద నీటితో నిండే అవకాశం ఉండడంతో దిగువ నుంచి ఎగువకు నీటిని పంప్ చేయాల్సిన అవసరం ప్రస్తుతానికి లేదని నిర్ణయించడంతో మేడిగడ్డ, అన్నారం పంపింగ్ను తాత్కాలికంగా నిలిపివేశారు.
మరోవైపు ప్యాకేజ్-8 అతిపెద్ద భూగర్భ పంపింగ్ కేంద్రం వచ్చేనెల మొదటి వారంలో ప్రారంభించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ రోజు ఉన్నతాధికారులు ప్యాకేజ్-7, 8 పనులను పరిశీలించి ఆగష్టు 5వతేది పైన ఎప్పుడైనా పంపింగ్ ప్రారంభించి ఎల్లంపల్లి నుంచి నీటిని మిడ్మానేరుకు పంప్చేయాలని భావిస్తున్నారు.
లింక్-2లోని పంపింగ్ కేంద్రాలు పనిచేయడం ప్రారంభిస్తే లింక్-1లోని మూడు పంపింగ్ కేంద్రాలు (మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల) నిరంతరం పని చేయించాల్సి వస్తుంది. ఇప్పుడైతే తాత్కాలికంగా మేడిగడ్డ, అన్నారం పంపులను నిలిపివేశారు. అదే సమయంలో సుందిళ్ల నుంచి పంపింగ్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Medigadda Barrage
Date: 30.07.’19
Time: 06:00pm
FRL : +100.00m
Full capacity at FRL:16.17tmc
Dead Storage at +92.00m:1.49tmc
Present level : +96.10m
Present capacity: 6.329tmc
Present water level in Forebay:+95.70m
Number of Barrage Gates opened :30 No.s
Annaram Barrage
Date:30.07.19
Time:5pm
FRL : +119.00m
Full capacity at FRL:10.87tmc
Dead Storage at +115.00m:3.84tmc
Present level : +117.900m
Present capacity:8.34TMC
Pump house: 0.0 cusecs
Annaram pumphouse forebay water level:117.800m
Backwater distance:
1.Godavari river:31.5kms
2.Manair river:5kms
Kaddam Narayan Reddy Project
Water level on 30-07-2019 @07:00 PM, is 694.100 Ft.(6.152TMC)
Inflow:15535 c/s
Outflows:
Surplus Discharge=26400 c/s by Gate No’s 6,9,10 opened to 10 feet height.
SYP status
30-07-2019.
At 7:00 PM
Level : + 141.58 / 148.00 M
Capacity : 6.8538 / 20.175 TMC.
Instant Inflow : 18750 c/s.
Surplus Discharge : Nil c/s.
Sundilla Barrage
Date:30.07.19
Time:6:00 p.m.
FRL : +130.00
Full capacity at FRL:8.83TMC
Dead Storage at +125.00m:3.01tmc
Present level : +128.10m
Present capacity:5.998TMC
Backwater distance
in Godavari river: 30.50kms (SYP)