తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులనుంచి వర్షాలు జోరుగా కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కడెం ప్రాజక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో మంగళవారం సాయంత్రం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రాజెక్టు వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఒక్కో గేటును 10 అడుగుల మేర ఎత్తారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 693.675 అడుగులకు నీరు చేరుకుందని నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి 29,169 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుందని చెప్పారు.
నిర్మల్ జిల్లా లోని కడెం ప్రాజెక్టు గేట్లు విడుదల చేస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..
Posted by Indrakaran Reddy Allola on Tuesday, 30 July 2019