Home / ANDHRAPRADESH / వర్షాలు కురుస్తుండడంతో నారుమడులు వేస్తున్న రైతులు.. పచ్చదనం సంతరించుకుంటున్న పొలాలు

వర్షాలు కురుస్తుండడంతో నారుమడులు వేస్తున్న రైతులు.. పచ్చదనం సంతరించుకుంటున్న పొలాలు

మొన్నటి దాకా వర్షాలులేక ఎదురు చూస్తున్న తెలుగురాష్ట్రాల్లో వర్షాలు స్వాగతం పలికాయి. రేపటినుంచి తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాజస్థాన్‌ నుంచి మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా ఒడిశావరకు ఉపరితల ధ్రోణి విస్తరించడంతో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. దీంతో విస్తారమైన వర్షపాతం నమోదవుతోంది. తాజాగా రెండురోజుల నుంచి కురుస్తోన్న తేలికపాటి జల్లులతో భాగ్యనగరం తడిసిముద్దయ్యింది. ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి స్వాంతన చేకూరింది. అలాగే భారత వాతావరణ శాఖ రాబోయే 48గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. సముద్రం అల్లకల్లోలమై ఉందని మత్య్సకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావారణశాఖ అధికారులు స్పష్టంచేశారు.

అలాగే మరో 48 గంటల్లో ముంబైకి వానగండం ఉందట.. ముంబై మహానగరంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పేర్కొంది. దీంతోపాటు ఛత్తీస్ గఢ్, తెలంగాణ, మధ్య మహారాష్ట్ర, గుజరాత్, విదర్భ, మధ్యప్రదేవ్, నాగాలాండ్‌లో కూడా వర్షాలు కురుస్తాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ప్రస్తుతం కురుస్తున్న వానలు రైతుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. మెట్టపంట వేసే రైతులు గత రెండు రోజుల నుండి విత్తనాలు వేస్తున్నారు. జూన్ మూడో వారంలో నైరుతీ రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన నాలుగైదు రోజుల పాటు కొద్దిపాటి వానలు కురిశాయి.

తర్వాత గత 40 రోజుల్లో ఉత్తర తెలంగాణలోని పదిజిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, దక్షిణ తెలంగాణలో తక్కువ వర్షపాతం నమోదైంది. గత రెండు, మూడు రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయిఅటు ఆంధ్రాలో కూడా పలు చోట్ల వర్షాలు భారీగా కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వారం రోజుల నుండి తెరపి లేకుండా పడుతున్నాయి. ఈ ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఏపీలోని కొన్ని జిల్లాల్లో పంట పొలాలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు నెల‌లు ఆల‌స్యంగా వ‌చ్చిన‌ వ‌ర్షాలను ఒడిసి ప‌ట్టుకోని వ‌రినాట్లు వేస్తున్నారు అన్నదాత‌లు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat