తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు కీలక ఆదేశాలను జారీచేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వలన.. పైనుండి వస్తున్న వరదల వలన ఆల్మట్టి,నారాయణ్ పూర్ నుంచి కృష్ణానది పరవళ్లు తొక్కుతూ వస్తుంది. దీంతో జూరాల ప్రాజెక్టులోకి భారీగా వరద నీళ్లు వస్తున్నాయి.దీనివలన జూరాల నిండిన వెంటనే నెట్టెంపాడు,బీమా,కోయిల్ సాగర్ లిప్టులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీచేశారు. భారీగా వరద వచ్చే అవకాశమున్నందున పరీవాహక ప్రాంతాలను అప్రమత్తం చేయాలి.. ప్రజలకు సరైన మార్గనిర్ధేశకాలను సూచించాలని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండాలని సంబంధిత అధికారులను హెచ్చరిచ్చారు. అవసరమైతే కల్వకుర్తి లిఫ్ట్ పంపులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు తెలిపారు.
