వాన్‌పిక్ కేసులో సీఎం జగన్మోహన్ రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్‌కు.. ఈడీ ట్రిబ్యునల్ నుంచి ఊరట లభించింది. గతంలో ఈడీ జప్తు చేసిన ఆస్తులను విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో.. జగన్‌కు చెందిన 538 కోట్ల రూపాయల మేర ఊరట దక్కింది. ఇడుపుల పాయలో 42 ఏకరాలు, పులివెందులలో 16 ఎకరాలు, బంజారాహిల్స్ సాగర్ సొసైటీలో ఫ్లాట్లు, కమర్షియల్ స్థలాలు, షేర్లు, ఓ టీవీ ఛానెల్‌కు సంబంధించిన యంత్రాల జప్తు జరిగింది. ఇప్పుడు వీటిని విడుదల చేయాలని ట్రిబ్యునల్ ఆదేశించింది.
