Home / ANDHRAPRADESH / సంబరాల్లో వైసీపీ శ్రేణులు.. త్వరలోనే న్యాయ విచారణలో అన్ని కేసులు వీగిపోతాయంటూ హర్షం

సంబరాల్లో వైసీపీ శ్రేణులు.. త్వరలోనే న్యాయ విచారణలో అన్ని కేసులు వీగిపోతాయంటూ హర్షం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పెట్టిన అక్రమాస్తుల కేసులో భారతి సిమెంట్స్ డైరెక్టర్ జెల్లా జగన్మోహన్ రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసులో భాగస్వామ్యం ఉందంటూ గతంలో ఈడీ జెల్లా జగన్మోహన్ రెడ్డి ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. కాగా… ఆ ఆస్తులను తిరిగి ఇవ్వాలంటూ అప్పిలేట్ ట్రైబ్యునల్ తాజాగా తీర్పు వెలువరించింది. జెల్లా జగన్మోహన్ రెడ్డికి.. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ప్రమేయం ఉందని ఈడీ ఆరోపిస్తోంది. ఆయన ద్వారా కడప జిల్లాలోని భారతి సిమెంట్స్ సంస్థ 2037 ఎకరాల మైనింగ్ లీజు పొందిందని, దీనికోసం మైనింగ్ చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిందని ఈడీ పేర్కొంది. ఇందుకు ప్రతిఫలంగా అర్హత లేకపోయినా జెల్లా జగన్ ను భారతి సిమెంట్స్ డైరెక్టర్ గా నియమించిన భారీ వేతనాలు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలో కడప జిల్లా కోడూరు మండలం సెట్టిగుంట గ్రామంలో రూ.15.22లక్షల విలువైన 27ఎకరాల పొలం, మణికొండ ల్యాంకోహిల్స్ లో రూ.1.30కోట్ల విలువైన ఇల్లు, మొత్తం రూ.1,45,45,799విలువైన ఆస్తులను ఈడీ జప్తుచేసింది. దీనిని సవాలు చేస్తే జెల్లా జగన్ అప్పిలేట్ ట్రైబ్యునల్ ని ఆశ్రయించారు. అయితే ప్రస్తుతం జెల్లా జగన్మోహన్ రెడ్డికి సంబంధిచి ఆస్తులు వెనక్కి ఇవ్వాలని తీర్పు రావడంతో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులు కూడా వీగిపోతాయని, తమకు న్యాయం జరుగుతుదంటూ వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat