ఎంతో హుందాగా మొదలైన బిగ్ బాస్ 3 ది రియాలిటీ షో రెండోవారం విషయాల్లోకి వస్తే… నటి హేమ బిగ్ బాస్ హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యింది. ఇంకా చెప్పాలి అంటే నెటిజన్లు మరియు కంటెస్టెంట్స్ దగ్గరుండి పంపించారని చెప్పాలి. అయితే తొలి రెండు సీజన్లు తో చూసుకుంటే ఈసారి మాత్రం కంటెస్టెంట్స్ రూల్స్ విషయంలో చాలా తేడాగా ఉందని చెప్పాలి ఎందుకంటే హౌస్ లో అడుగు పెట్టిన సమయం నుండి గొడవలు మొదలయ్యాయి కాని వెంటనే సర్దుకుపోయేవారు. ఈసారి మొదటిగా హేమ వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే దానికి ముఖ్య కారణం తన హౌస్ కంటెస్టెంట్స్ పై తన పెత్తనమనే చెప్పాలి. ఇక హేమ అయితే మాత్రం నేను పెత్తనం చెయ్యలేదని ఒక అమ్మగా కిచెన్ విషయంలో వారికి అండగా ఉండాలని అనుకున్నానని అన్నారు.