ఐదు సార్లు ఎంపీ.. రెండు సార్లు రాజ్యసభ ఎంపీ.. ఐదు దఫాలుగా కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కేంద్ర మాజీ మంత్రి,తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన సూదిని జైపాల్ రెడ్డి శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతూ శనివారం రాత్రి మృతిచెందారు. ఈ రోజు సోమవారం ఆయనకు అంత్యక్రియలు జరగనున్నాయి.
అయితే కేంద్ర మాజీ మంత్రి అయిన జైపాల్ రెడ్డికి ఒకరంటే అత్యంత నమ్మకం.. ఆయనకు అన్నివేళల చేదోడు వాదోడుగా అతను ఉండేవాడు.. అతనే తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో హయత్ నగర్ కి చెందిన వెంకట్రామిరెడ్డి. ఇతను దాదాపు ముప్పై ఐదేళ్ళపాటు జైపాల్ రెడ్డిగారితో ఉన్నారు.
1980లో జనతా పార్టీలో చేరిన వెంకట్రామిరెడ్డి క్రమక్రమంగా జైపాల్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. పుట్టినప్పటి నుండి దివ్యాంగుడైన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి కి అన్నివిధాలుగా ఇతను సాయంగా ఉండేవాడు.జైపాల్ తో ఉన్నసమయంలో ఒక్క విషయం కూడా బయటకు పోనిచ్చేవాడు కాదు అంట. అంతనమ్మకంగా ఉండేవాడు అంట వెంకట్రామిరెడ్డి. ఈ కారణంతోనే జైపాల్ రెడ్డి కేంద్రమంత్రిగా పని చేసినప్పుడు వెంకట్రామిరెడ్డిని ఓఎస్డీగా నియమించుకున్నారు ..