యంగ్ రెబెల్ స్టార్ హీరోగా నటిస్తున్న చిత్రం సాహో..ఇప్పటికే ఈ చిత్రంపై ఫాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటిస్తుంది. నాలుగు బాషల్లో ఒకేసారి విడుదలవుతున్న ఈ చిత్రం హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ చిత్ర ట్రైలర్ ను ఆగష్టు 15విడుదల విడుదల చేయనున్నారు చిత్ర యూనిట్. అయితే అసలు ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చెయ్యాలని ముందుగా అనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ కారణంగా ఈ చిత్రాన్ని 30కి వాయిదా వేయడం జరిగింది.
