Home / ANDHRAPRADESH / యువ ముఖ్యమంత్రి మార్పుకోసం ముందడుగు వేస్తుంటే.. చంద్రబాబు ఎలాంటి పనులు చేస్తున్నాడో చూడండి

యువ ముఖ్యమంత్రి మార్పుకోసం ముందడుగు వేస్తుంటే.. చంద్రబాబు ఎలాంటి పనులు చేస్తున్నాడో చూడండి

ఏపీ సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వేర్వేరుగా విదేశీ పర్యటనలకు వెళ్లనున్నారు. ఇద్దరివీ వ్యక్తిగత పర్యటనలే అయినా ఆసక్తి నెలకొంది. చంద్రబాబు ఆదివారం అమెరికా వెళ్లారు.. మూడ్రోజులపాటు ఆయనలో అమెరికా పర్యటనలో ఉండబోతున్నారు. వైద్య పరీక్షల నిమిత్తమే బాబు యూఎస్ వెళ్తున్నారని తెలుస్తోంది. ఆయన తిరిగి ఆగష్టు 1న ఇండియాకి రానున్నారు. అలాగే జగన్ అమెరికా పర్యటన కూడా ఖరారైంది. ఆగస్టు 17నుంచి 23వరకు కుటుంబ సభ్యులతో కలిసి జగన్ అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా జగన్ 17న నార్త్ అమెరికా తెలుగు కమ్యూనిటీ ఆహ్వానసభలో పాల్గొంటారు. తన అమెరికా పర్యటన సందర్భంగా డల్లాస్‌లోని కేబెల్లే కన్వెన్షన్ సెంటర్ ప్రవాస్ భారతీయులతో జగన్ సమావేశమవుతారని తెలుస్తోంది.

ఈ పర్యటనలోనే ఏపీలో పెట్టుబడులకు ఉన్న సానుకూల వాతావరణంపై జగన్ పలువురు ప్రముఖులతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. మిషిగన్- డెట్రాయిట్ -కోబో కన్వెన్షన్ సెంటర్‌లో ప్రవాసాంధ్రులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక జగన్ తొలి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. అయితే జగన్ కుటుంబంతో సహా వ్యక్తిగత పర్యటనకు వెళ్తున్నా అక్కడినుంచి పెట్టుబడులకు ఉన్న సానుకూల వాతావరణంపై జగన్ పలువురు ప్రముఖులతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. కానీ చంద్రబాబు మాత్రం వైద్య పరీక్షలకు అనే సాకుతో కొందరిని కలవడానికి వెళ్తూ అక్కడ మీటింగ్ ప్లాన్ చేసుకున్నట్టు అర్ధమవుతోంది. అయితే చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి తన విదేశీ పర్యటనలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగా యువ ముఖ్యమంత్రి జగన్ మాత్రం మార్పుకోసం ముందడుగు వేసారు. తన వ్యక్తిగత సొమ్మును మాత్రమే తన పర్యటనల నిమిత్తం జగన్ ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat