నా ప్రతిభను అన్ని దేశాలు గుర్తిస్తున్నాయని..ఈ మేరకు దేశంలో ఏ ముఖ్యమంత్రిని పిలవని విధంగా నన్ను మాత్రమే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు పిలుస్తారని బాబుగారు చెప్పిన మాటల్లో వాస్తవం లేదని, చంద్రబాబును ప్రత్యేకంగా ఎప్పుడూ ఈ సమావేశాలకు పిలవలేదని ఆయనే కోట్లు కర్చుపెట్టి వెళ్ళినట్లు సాక్షాలతో సహా బయటపడ్డాయి. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి పెట్టుబడుల ఆకర్షణ పేరుతో చంద్రబాబు గారు దావోస్లో ఏపీ లాంజ్ కోసం రూ.17 కోట్లు మంచి నీళ్లలా ఖర్చు చేయడంపై దర్యాప్తు జరగాలని, 4 రోజుల భోజనాలకు 1.05 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారో తేలాలని అన్నారు.