కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కన్ను మూత (77) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా విపరీతమైన జ్వరంతో చలిస్తుస్తున్న ఆయన ఈనెల 20న గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ర్టో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చేరారు. ఆ ఎఒజు నుండి చికిత్సపొందుతూనే ఉన్నారు. ఈ ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఈయన 1942 జనవరి 16న జన్మించారు. 1969, 1984 మధ్య నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి… జనతా పార్టీలో చేరారు. 1984లో మహబూబ్‌నగర్ ఎంపీగా గెలిచారు. 1985 నుంచి 1988 వరకూ జనతా పార్టీ జనరల్ సెక్రెటరీగా పనిచేశారు. 1990, 1996లో రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.
1991-1992 మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా విధులు నిర్వహించారు. 1998లో అప్పటి ప్రధాని ఐకే గుజ్రాల్ కేబినెట్‌లో సమాచార, ప్రసార శాఖా మంత్రిగా పనిచేశారు. 1999లో జైపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు.1999, 2004లో మిర్యాలగూడ లోక్ సభ స్థానం నుంచి గెలుపు సాధించారు.2004లో యూపీఏ తొలి ప్రభుత్వ హయాంలో మిర్యాలగూడ నుంచీ గెలిచి, తిరిగి కేంద్ర మంత్రిగా పనిచేశారు ..2009లో యూపీఏ రెండో ప్రభుత్వ హయాంలో చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచీ ఎన్నికై… పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రిగా పనిచేశారు. 2012-2014 మధ్య కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా చేశారు..ఆయనకి భార్య, ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు….