ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల సమయంలో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గెలిచిన విషయం అందరికి తెలిసిందే. గెలిచిన తరువాత ఆయన ప్రజలకు చేసింది మాత్రం ఏమీ లేదనే చెప్పాలి. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు ప్రజలుకు ఏది చెయ్యకపోయినా తన సొంత ప్రయోజనాలకు ప్రజల సొమ్ము మొత్తం వాడుకున్నారు. ప్రత్యేకంగా తన కుటుంబ బాగుకోసమే ఆలోచించాడు తప్ప ప్రజల కోసం ఆలోచించలేదు. ఇక అసలు విషయానికి వస్తే తాజా సమాచారం ప్రకారం అప్పట్లో రాజధాని ప్రకటనకు కొద్ది రోజుల ముందు బాబు బామ్మర్ది ప్రస్తుత హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 500 ఎకరాలు కొన్నాడట.
అమరావతినే రాజధానిగా పెడుతున్నానని తన సొంత కులస్తులకు ముందుగా చెప్పడంతో పేద రైతుల నుంచి ముక్యంగా BC /SC /ST ల నుంచి అతి తక్కువ రేట్లకు దాదాపు 10 వేల బాబు బినామీలైన సుజనా చౌదరి , బాలయ్య, అప్పటి మంత్రులు దేవినేని ఉమా, పుల్లారావు , నారాయణ.. తదితరులు కొనేసారు. ఇలా నిరుపేదల కడుపు కొట్టేసారు. ఇదంతా పక్కన పెడితే రాజధానిలోనే రియల్ ఎస్టేట్ చేయడం ద్వారా సుమారు 20 వేల కోట్లు బాబు అండ్ కో సంపాదించారట. ఇటీవలే బాలయ్య మాజీ PA శేఖర్ కు అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని కోర్ట్ మూడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. త్వరలోనే ప్రతీ ఒక్కరు బయటకు వస్తారని సమాచారం.