సమంత ఒకపక్క చక్కని అభినయంతో మరోపక్క అందంతో ఇటు కుర్రకారుతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకర్శించిన ముద్దుగుమ్మ. తెలుగు సినిమాకు నాలుగు స్థంబాల్లో ఒక స్థంబంగా భావించే అక్కినేని వారింట కొడలుగా అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. అప్పటి నుండి వరుస కుటుంబ చిత్రాలతో అలరిస్తూ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన ఓ బేబీ మూవీ బాక్సాఫీసు దగ్గర కోట్లను కొల్లగొట్టడమే కాకుండా సూపర్ డూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు అమ్మడు తన రెమ్యూనేషన్ కేవలం రెండు కోట్ల రూపాయలు మాత్రమే తీసుకునేదని ఇండస్ట్రీలో నిర్మాతదర్శకులు చెబుతున్నారు. అయితే తాజాగా ఓ బేబీ మూవీ హిట్ తో తన రెమ్యూనేషన్ అమాంతం పెంచేసిందంటా. ఏకంగా కోటి రూపాయలకు పెంచిందంట. తనతో ఇక మూవీ తీయాలంటే మూడు కోట్లు సమర్పించుకోవాల్సిందే అని తెగేసి చెప్పింది అమ్మడు. చూడాలి మరి టాప్ రేంజ్లో ఉన్న అమ్మడు వెంట ఏ నిర్మాత దర్శకులు పడతారో..?