టీమిండియా కొత్త కోచ్ ఎంపిక విషయంలో గత కొన్ని రోజులుగా ఉన్న గందరగోళానికి ఈరోజు తెరపడింది. మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ కోచ్ ఎంపికను పూర్తి చేస్తుందని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన స్టాఫ్‌కు వచ్చే నెలలో ఇంటర్వ్యూలు జరుగుతాయని అన్నారు. అంతకముందు కపిల్ నేతృత్వంలోని ఈ కమిటీ మహిళల జట్టు కోచ్‌గా డబ్ల్యూవీ రామన్‌ను ఎంపిక చేయడం జరిగింది. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రిని ఎంపిక చేసిన సీఏసీలోని సచిన్, సౌరవ్, లక్ష్మణ్‌పై పరస్పర విరుద్ధ ప్రయోజనాల కేసు సుప్రీంలో నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో కోచ్ ఎంపిక బాధ్యత ఈసారి కపిల్ కమిటీకి మారింది. అయితే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ ఎంపిక ఇప్పుడు వీళ్లకు కత్తిమీద సాముగా మారనుంది అనడంలో సందేహం లేదు. ఇది ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో కోహ్లి, రోహిత్ మధ్య విబేధాలు వస్తున్నాయనే వార్త అబద్దమని రాయ్ స్పష్టం చేశారు.