దేశ వాణిజ్య కేంద్రమైన ముంబై ప్రస్తుతం సముద్రంలా మారిపోయింది. రాత్రి నుండి కుండపోతగా వర్షం కురవడంతో నగరంలో చాలా ప్రాంతాలు జలమయంగా మారిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే వరదలు ముంతెచ్చుతున్నాయి. మతుంగా, పతాలిపడ, శాంతా క్రజ్ , వసాయి, బాదల్ పూర్, అంబర్ నాథ్, కల్యాణ్ , కుర్లా, థానే ప్రాంతాల్లో అయితే మాత్రం వర్షం ఎక్కువ శాతం ఉంది. ఇది చూస్తుంటే అప్పటి 2005 పరిస్థితే ఇప్పుడు వచ్చేలా ఉందని అందరు అనుకుంటున్నారు. కుండపోత వాన కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించడంతో ప్రజలు వణుకుతున్నారు. ఈ మేరకు ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్థంబించింది. అంతేకాకుండా రైల్ మరియు విమాన సర్వీసులను కూడా కాన్సిల్ చేసేసారు. దీంతో బయటనుండి వచ్చిన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.