వైట్ పాస్ అండ్ యుకోన్ రూట్:
ఈ రైలు మార్గం అలాస్కన్డ్ అండ్ కెనడా మధ్యలో 1889లో నిర్మించారు. ఈ రైలు మార్గం సుమారు 175 కిలోమీటర్ల పొడువు ఉంటుంది.ప్రస్తుతం ఈ రైలుమార్గం టూరిస్ట్ అట్రాక్షన్ గా మారింది.
ట్రైన్ టూ ది క్లౌడ్స్ :
ఎంతో పాపులర్ ఐన ఈ ట్రైన్ అర్జెంటీనా మరియు చిల్లి మధ్యన ప్రయాణిస్తుంది. ఈ భయంకరమైన బ్రిడ్జి సముద్రానికి 4220 మీటర్ల ఎత్తులో ఉంది. అంతేకాకుండా ప్రపంచంలో ఎత్తైన బ్రిడ్జిలలో ఇది ఐదవ స్థానంలో ఉంది. ఈ రైలుమార్గం చుట్టూ పెద్ద పెద్ద కొండలు, పంట భూములు కనిపిస్తాయి.
డెవిల్స్ నోస్ :
ప్రపంచంలో ఉన్న ప్రమాదకరమైన రైలు మార్గాల్లో ఇది ఒక్కటి.ఈ రైలుమార్గం యొక్క నిర్మాణం 19శతాబ్దంలో ప్రారంభించారు.అప్పట్లో దీనిని నిర్మించడానికి భయపడ్డారని తెలుస్తుంది.ఈ రైలుమార్గ నిర్మాణానికి 4000 మంది పనిచేయగా..ఈ నిర్మాణంలో కొందరు మరణించారు కూడా.ఈ రైలుమార్గం చాలా అంటే చాలా ప్రమదకరమైనదిగా చెబుతారు.
మేకలోంగ్ రైల్వే రూట్:
ఈ మేకలోంగ్ రైల్వే రూట్ థాయిలాండ్ లోని మార్కెట్ మధ్యలో ఉంటుంది.ఈ రైల్వే ట్రాక్ పై అక్కడివారు వ్యాపారం చేసుకుంటారు.ట్రైన్ వచ్చే సమయానికి వారి సామానులు పక్కన పెడతారు.ఇది అక్కడి ప్రజలకు అలవాటుగా మారిపోయింది.
పంబన్ బ్రిడ్జి :
ఇది చెన్నై రామేశ్వరంలోని ఉండే బ్రిడ్జి. దీనిని పంబన్ బ్రిడ్జి అని పిలుస్తారు.1988 లో ఈ బ్రిడ్జిను ప్రారంభించగా..ఇది 2 కిలోమీటర్ల పొడువు ఉంటుంది.ఈ బ్రిడ్జిను నిర్మించడానికి 14 సంవత్సరాలు పట్టింది.ఇది సముద్రంపై నిర్మించబడింది.