ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలిగింది. తన కుమార్తె విజయలక్ష్మికి హైకోర్టులో చుక్కెదురు అయింది. ఆమె ముందస్తు బెయిల్ కోసం నాలుగు పిటిషన్లను దాఖలు చేయగా అన్నింటిని న్యాయస్థానం తిరస్కరించడం జరిగింది. నరసరావుపేట టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో ఈ నాలుగు కేసులు నమోదు కాగా, అవన్నీ అక్రమ కేసులని, వాటిని రద్దు చెయ్యాలని కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఈ బెయిల్ ను తిరస్కరించింది. ఇప్పటికే కుటుంబం మొత్తం భూ దందాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులు, కే ట్యాక్స్ వసూలు, దౌర్జన్యాలు ఇలా ఎన్నో విషయాల్లో ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. దీంతో కుటుంబం మొత్తం త్వరలోనే జైలు ఊసలు లెక్కపెడతారని అనుకుంటున్నారు.