తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పాలి. ఇన్నిరోజులు స్వామివారి దర్శనానికి వెళ్ళాలంటే గంటల సేపు లైన్ లో ఉండి వెళ్ళాలి. అయితే ప్రస్తుతం అలాంటి ఇబ్బంది లేకుండా మార్పులు చేస్తున్నామని ఆలయ అధికారులు చెబుతున్నారు.భక్తుల సౌకర్యార్థం రూ.25 కోట్ల వ్యయంతో ఉద్యాయనవనంలో టీటీడీ చేపట్టిన అధునాతన కాంప్లెక్స్‌ల నిర్మాణం రెండు నెలల్లో పుర్తవనుంది. ఇది సెప్టెంబర్ లో మొదలయ్యే బ్రహ్మోత్సవాల సమయానికి భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు టీటీడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
భక్తులు గంటలకొద్దీ రోడ్లపై, చెట్ల కింద గడుపుతూ ఇబ్బంది పడడం, కొన్ని చోట్ల రద్దీగా ఉన్న సమయంలో తోపులాట వంటివి జరుగుతున్నాయి. ఇలాంటి సమస్యలు ఇంకెప్పుడు రాకుండా భవనాలు నిర్మిస్తున్నారు. ఇది గాని పూర్తి అయితే భక్తులు క్యూలైన్లో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని ఆ గదుల్లో ఉంటూ విశ్రాంతి తీసుకొని దర్శనం చేసుకోవచ్చని అధికారులు చెప్పడం జరిగింది.