మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ జనసేనకు గుడ్ బై చెప్పనున్నారని సమాచారం. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈయన జనసేన తరపున విశాఖపట్నం లోకసభ స్థానానికి పోటీ చేయగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే. అప్పటి నుండి ఆయన పార్టీకి కాస్త దూరంగానే ఉన్నాడు. అప్పట్లో లక్ష్మినారాయణ వైఎస్ జగన్ కేసుల విషయంలో వెలుగులోకి వచ్చాడు. అనంతరం మహారాష్ట్రకు వెళ్ళిపోయారు.కొన్ని రోజులకి పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో అడుగుపెట్టాడు. ఆ సమయంలో ఆయన సొంత పార్టీ పెడతారని కొందరు, మరికొందరు లోకసత్తా పార్టీకి నాయకత్వం వహిస్తారని అనుకున్నారు. చివరికి పవన్ పార్టీలో చేరాడు. ఆ పార్టీలో చేరి ఓటమి చవిచూశారు. ఓటమి తరువాత సైలెంట్ అయిపోవడమే కాకుండా ఆ పార్టీ జోలికి కూడా పోవడంలేదు. దీంతో ఆయన పార్టీకి దూరం అవతారాని ప్రచారం కొనసాగుతుంది. దీనికి ఉదాహరణే తాజాగా పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన పార్టీ పోలిట్ బ్యూరోలో ఆయనకు చోటు దక్కక పోవడమే.
