తెలంగాణకు కేంద్రం ఇప్పటివరకు 14 ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులను మంజూరు చేసిందని ఫుడ్ ప్రాసెసింగ్‌శాఖ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ తెలిపారు. ఇందులో రెం డు మెగా ఫుడ్ పార్కులు కూడా ఉన్నాయని శుక్రవారం రాజ్యసభ క్వశ్చన్‌అవర్‌లో టీఆర్‌ఎస్ పక్షనేత కే కేశవరావు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాష్ట్రం చేసిన ప్రతిపాదనలేవీ పెండింగ్‌లో లేవని స్పష్టంచేశారు. తెలంగాణకు మేం 14 ప్రాజెక్టులను మంజూరుచేశాం. ఇందుకోసం రూ.187.4 కోట్ల సా యాన్ని అందించేందుకు కేంద్రం ఆమోదం తెలుపగా, ఇప్పటివరకు దశలవారీగా రూ. 93.28 కోట్లను మంజూరుచేసింది. మౌలిక సదుపాయాలు పూర్తయ్యేకొద్దీ నిధులు విడుదలవుతాయి. ఇవన్నీ ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులు అని హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ చెప్పా రు. ఈ ప్రాజెక్టులకు ప్రధాన్‌మంత్రి సంపద యోజన కింద నిధులు ఇస్తున్నామని తెలిపారు.
Tags amith shah k keshwararao kcr kk ktr loksabha Modi mp nda slider telangana telanganacm telanganacmo trs trswp