టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు ఫిలిం చాంబర్ ఎన్నికలు ఈ రోజు శనివారం ముగిశాయి. ప్రముఖ అగ్రనిర్మాత దిల్ రాజు, మరో నిర్మాత సీ కల్యాణ్ వర్గాలు పోటాపోటిగా తలపడిన ఈ ఎన్నికల్లో సీ కల్యాణ్ వర్గం పైచేయి సాధించింది. సీ కల్యాణ్, ప్రసన్నలు నేతృత్వం వహిస్తున్న మన ప్యానల్ ఈసీ మెంబర్స్‌తో పాటు సెక్టార్ మెంబర్స్‌ను కూడా పెద్ద సంఖ్యలో గెలిపించుకోని ఘనవిజయం సాధించింది. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ప్యానల్ విజయం సాధించకపోయినా ఆ ప్యానల్ నుంచి దిల్ రాజు, దామోదర ప్రసాద్‌లు ఈసీ సభ్యులుగా విజయం సాధించారు.12 మంది ఈసీ మెంబర్‌లలో 9 మంది సీ కల్యాణ్ నేతృత్వంలోని మన ప్యానెల్ నుంచి గెలుపొందగా, ఇద్దరు దిల్ రాజు సారధ్యంలోని యాక్టివ్ ప్యానల్ నుంచి విజయం సాధించారు. మోహన్ గౌడ్ ఇండిపెండెంట్‌గా పోటి చేసి విజయం సాధించారు. 20 మంది సెక్టార్ మెంబర్స్‌లో 16 మంది మన ప్యానల్ నుంచి విజయం సాధించగా, నలుగురు యాక్టివ్ ప్యానల్ నుంచి గెలుపొందారు.
