టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి టీటీడీ డీఈఓగా క్రిస్టోఫర్‌ను నియమించారంటూ తప్పుడు వార్తను ప్రచురించిన టీవీ5 పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, కేసులు కూడా పెడతామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులున్న శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసి, రెచ్చగొట్టడానికి టీవీ5 ప్రయత్నించడంతో వైవీ ఈ నిర్ణయం తీసుకున్నారు. టీవీ5 ఛానెల్ తన వెబ్సైట్లో టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని వైవీ సీరియస్ అయ్యారు.సీఎం జగన్ చేస్తున్న మంచి పనులను స్వాగతించలేక ఈర్ష్యతో, ద్వేషంతో, అసూయతో వ్యవహరిస్తున్నారని, టీటీడీలో వీఐపీ సంస్కృతిని నిర్మూలించడానికి చేస్తున్న ప్రయత్నాలను స్వాగతించలేకపోతున్నారన్నారు. దేవుడి ముందు అందరూ సమానులేనని తాము నిరూపిస్తుంటే, ఆ చర్యలను జీర్ణించుకోలేకపోతున్నారని, అబద్ధాలు, దుష్ప్రచారాలతో ప్రభుత్వ ప్రతిష్టను, వైయస్.
జగన్ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ విషప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.. అయితే గతంలోనూ టీవీ5 వైసీపీ విషయంలో ఇలాగే వ్యవహరించింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ విషయంలోనూ ఈ చానల్ తప్పుడు సర్వేలిచ్చింది. అనవరసనర డిబేట్లతో ప్రజలను చాలాసార్లు గందరగోళానికి తెరలేపింది. రేటింగ్ కోసం దిగజారుడు కధనాలను ప్రసారం చేసి జర్నలిజం విలువలను కాలరాసింది. అయితే తాజాగా ఏకంగా టీటీడీపైనే ఇటువంటి వ్యవహారానికి తెరలేపడంతో ఇప్పుడు ఏకంగా టీటీడీ చైర్మన్ ఆగ్రహానికి గురైన టీవీ5 ఈ నేపధ్యంలో టీవీ5పై చర్యలు తీసుకోనున్నట్టు స్పష్టమవుతోంది.