టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు ,హీరో అక్కినేని నాగార్జున వారసుడు,యువహీరో అక్కినేని నాగచైతన్య అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అటు నవ్యాంధ్ర ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే అత్యధిక పన్నును చెల్లించిన వ్యక్తిగా పేరు గాంచాడు.ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అత్యధిక పన్నులను చెల్లించినవారిని ఆదాయపు పన్ను శాఖ సన్మానించింది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల విభాగంలో టాలీవుడ్ నటులు నాగచైతన్య ,సుశాంత్ టాప్ లో ఉన్నారు. మహిళా వ్యక్తిగత పన్ను చెల్లించిన వారి జాబితాలో భాగవతీ దేవి,అనిత టాప్ లో ఉన్నారు. అత్య్ధధిక పన్ను చెల్లించిన సంస్థల్లో అటు ఏపీ, ఇటు తెలంగాణాల్లో ఎన్ఎండీసీ తొలిస్థానంలో ఉంది. ఆంధ్రాబ్యాంకు,సింగరేణీకాలరీసు తర్వాత స్థానాల్లో నిలిచాయి.
